క్రికెట్ అంటే మన దేశంలో అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). అలాంటి ముద్రను ఈ క్రీడపై వేశాడు మాస్టర్ బ్లాస్టర్. క్రికెట్ చరిత్రలో అసమాన రికార్డులెన్నింటినో నెలకొల్పి చరిత్ర సృష్టించి క్రికెట్ గాడ్ పై పేరు ప్రఖ్యాతులు సంపాందించాడు. సచిన్ రికార్డుల్ని చూస్తే.. వీటి దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేనంతగా ఉంటాయ్.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ (తొలి టెస్ట్ ముందు వరకు) 92 టెస్టులాడి 52.00 సగటుతో 7547 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేల పరుగులు చేశాడు.
ఇక, ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ 63 టెస్ట్ మ్యాచుల్లో 37 విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్‌ను అధిగమించాడు. లార్డ్స్ టెస్టుకు ముందు వరకు 36 టెస్ట్ విజయాలతో కోహ్లీ లాయిడ్ సమానంగా ఉన్నారు. ఇప్పుడు లాయిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టేశాడు.
ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు సాధించింది విరాట్ కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు అందుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న సౌరవ్ గంగూలీ 49 మ్యాచుల్లో 21 విజయాలు అందుకున్నాడు. మొహ్మద్ అజారుద్దీన్ (14), సునీల్ గవాస్కర్ (9), ఎంకే పటౌడీ (9)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.