Home » photogallery » sports » ON THIS DAY IN 1983 TEAM INDIA WON MAIDEN WORLD CUP AND HERE THE SALARY DETAILS OF KAPIL DEVS TEAM ON THAT TIME SRD

1983 World Cup : 1983 వరల్డ్ కప్ లో భార‌త ఆట‌గాళ్ల పారితోషికం ఎంతో తెలుసా..? కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

1983 World Cup : సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్‌ 25, 1983) భారత క్రికెట్‌ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్‌లో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి నాంది పలికింది. 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (1983 Cricket World Cup ) లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ ( Kapil Dev ) జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 38 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, ఆ నాటి జట్టు సంపాదన వివరాలు ఎంతో తెలిస్తే షాకవ్వడం గ్యారెంటీ.