అయితే మూడో టి20లో మాత్రం విండీస్ జట్టు సత్తా చాటింది. 8 వికెట్లతో ప్రత్యర్థిపై ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ (3/29), అకీల్ హొసేన్ (2/28) దెబ్బతీశారు. వీరికి డోమినిక్ డ్రేక్స్ (1/19), హేడెన్ వాల్ష్ (1/16) కూడా సహకరించారు. (PC : TWITTER)
అనంతరం ఛేదనలో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షమార్ బ్రూక్స్ (59 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో విండీస్ 19 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుస ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఫలితంగా విండీస్ 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఐష్ సోధీకి తలో వికెట్ దక్కింది. సిరీస్ మొత్తంలో 5 అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఓ హాఫ్ సెంచరీ సహా 100కిపైగా పరుగులు సాధించిన గ్లెన్ ఫిలిప్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్‌లో సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.