Tennis : క్యాలెండర్ గోల్డెన్ స్లామ్‌పై కన్నేసిన జకోవిచ్? ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ ఎవరో తెలుసా?
Tennis : క్యాలెండర్ గోల్డెన్ స్లామ్‌పై కన్నేసిన జకోవిచ్? ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ ఎవరో తెలుసా?
వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ఓపెన్, యూఎస్ ఓపెన్లను గ్రాండ్‌స్లామ్స్ అంటారని తెలుసు. ఆ ఐదు ట్రోఫీలను ఒకే ఏడాది గెలిస్తే క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ అంటారు. అదే ఏడాది ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిస్తే క్యాలెండర్ గోల్డెన్ స్లామ్ అంటారు. ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 జకోవిచ్ గోల్డెన్ స్లామ్‌పై కన్నేశాడు.
వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచాడు. వింబుల్డన్ గెలవడం ద్వారా 20 గ్రాండ్ స్లామ్స్ సాధించి రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన చేరాడు. (Twitter)
2/ 12
రోజర్ ఫెదరర్ ఖాతాలో ఇది 6వ వింబుల్డన్ టైటిల్. ఇక ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కూడా గెలిస్తే క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రికార్డు సొంతం చేసుకోవచ్చు. (Twitter)
3/ 12
కాగా, జకోవిచ్ ముందు మరో అరుదైన అవకాశం కూడా ఉన్నది. అదే గోల్డెన్ గ్రాండ్‌స్లామ్. (Twitter)
4/ 12
ఇప్పటికే ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన జకోవిచ్.. సెర్బియా తరపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాడు. (Twitter)
5/ 12
ఒలింపిక్స్‌లో మెన్స్ సింగిల్స్ స్వర్ణ పతకం సాధించి.. ఆ తర్వాత ఆరు వారాలకు జరిగే యూఎస్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకుంటే క్యాలెండర్ గోల్డెన్ స్లామ్ సాధించినట్లు అవుతుంది. (Twitter)
6/ 12
ఒకవేళ ఒలింపిక్స్‌లో ఓడిపోయి.. యూఎస్ ఓపెన్ గెలిచినా.. క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ రికార్డు నెలకొల్పే అవకాశం ఉన్నది. (Twitter)
7/ 12
టెన్నిస్ చరిత్రలో క్యాలెండర్ గోల్డ్ స్లామ్ సాధించిన ఏకైక ప్లేయర్ స్టెఫీగ్రాఫ్. (Twitter)
8/ 12
స్టెఫీ గ్రాఫ్ 1988లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌తో పాటు సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించింది. (Twitter)
9/ 12
ఆస్ట్రేలియన్ పురుష టెన్నిస్ ప్లేయర్ రాడ్ లావర్ 1969లో క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఆ తర్వాత మరో మెన్స్ ప్లేయర్ ఆ ఘనత సాధించలేదు. (Twitter)
10/ 12
ఇక కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన వారిలో స్టెఫీ గ్రాఫ్ భర్త ఆండ్రీ అగస్సీ కూడా ఉన్నాడు. కెరీర్ గోల్డెన్ స్లామ్ అంటే వేర్వేరు ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా గెలవడం. (Twitter)
11/ 12
రఫెల్ నదాల్ కూడా కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించాడు. 2008 ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించాడు. (Twitter)
12/ 12
సెరేనా విలియమ్స్ కూడా కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించింది. (Twitter)