SRH : ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కు బౌలింగ్ కూడా వచ్చా.. ఏకంగా చరిత్ర లిఖించాడే..
SRH : ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కు బౌలింగ్ కూడా వచ్చా.. ఏకంగా చరిత్ర లిఖించాడే..
SRH : సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 6 విజయాలు 6 పరాజయాలతో 12 పాయింట్లతో గతేడాదిలానే ఈసారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే తాజాగా సన్ రైజర్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ తనలోని మరో ట్యాలెంట్ ను బయటపెట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఈ ఏడాది చెత్త ప్రదర్శన చేసింది. గత సీజన్ తో పోలిస్తే కాస్త మెరుగు పడినా.. అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.
2/ 7
సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో 6 విజయాలు 6 పరాజయాలతో 12 పాయింట్లతో గతేడాదిలానే ఈసారి కూడా ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే తాజాగా సన్ రైజర్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ తనలోని మరో ట్యాలెంట్ ను బయటపెట్టాడు.
3/ 7
ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు కు కెప్టెన్ గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తున్నాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో అతడు బౌలింగ్ కూడా చేశాడు. షై హోప్ రూపంలో టీంలో మరో వికెట్ కీపర్ ఉండటంతో పూరన్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
4/ 7
10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన పూరన్.. 48 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. కెప్టెన్ హోదాలో బౌలింగ్ చేస్తూ 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా పూరన్ నిలవడం మరో విశేషం.
5/ 7
ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, గ్రాహం గూచ్ (ఇంగ్లండ్), మైక్ గాటింగ్, నౌరోజ్ మంగల్ పూరన్ కంటే కూడా ముందుగా కెప్టెన్ హోదాలో వన్డేల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు.
6/ 7
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. గ్రాహం గూచ్, గాటింగ్, నౌరోజ్ మంగల్ మూడు వికెట్లు తీశారు.
7/ 7
అయితే మూడో వన్డేలో కూడా వెస్టిండీస్ జట్టు ఓటమి పక్షానే నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 53 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 37.2 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.