NEW ZEALAND STAR BATTER ROSS TAYLOR ANNOUNCES HIS RETIREMENT FROM INTERNATIONAL CRICKET AT END OF HOME SUMMER SK
Ross Taylor: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
Ross Taylor Retirement: ఇటీవలే భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం ఆడే అవకాశముంది.
2/ 7
ఐతే వెంటనే ఆయన తప్పుకోవడం లేదు. సమ్మర్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోనని టేలర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌పై మరో రెండు టెస్ట్‌లు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌పై ఆరు వన్డే మ్యాచ్‌ల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపారు.
3/ 7
17 ఏళ్లుగా తనకు అండగా ఉండి, మద్దుతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలని ట్వీట్ చేశారు రాస్ టేలర్. ఇన్నేళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
4/ 7
తన రిటైర్మెంట్పై రాస్ టేలర్ ట్వీట్
5/ 7
37 ఏళ్ల రాస్ టేలర్ న్యూజిలాండ్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. 2006లో కివీస్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పటి వరకు 109 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. న్యూజిలాండ్ తరుపున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టేలర్ పేరు మీదే ఉంది.
6/ 7
మూడు క్రికెట్ ఫార్మట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన తొలి అంతర్జాతీయ క్రికెట్ ఈయనే. టెస్ట్, వన్డేలు, టీ20ల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 18,074 పరుగులు చేశాడు టేలర్. ఇందులో 40 సెంచరీలు ఉన్నాయి.
7/ 7
ఇప్పటి వరకు 109 టెస్ట్‌లు ఆడిన టేలర్.. 7,577 పరుగులు చేశారు. ఇందులో 19 సంచరీలు ఉన్నాయి. 233 వన్డేలు ఆడి..8,581 రన్స్ చేశారు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 102 మ్యాచ్‌లు ఆడి..1,909 రన్స్ సాధించారు టేలర్.