Kane Williamson : ఏంది కేన్ మామా ఈ ఆట.. ఇలా అయితే వచ్చే ఐపీఎల్ లో నీ అడ్రస్ గల్లంతే
Kane Williamson : ఏంది కేన్ మామా ఈ ఆట.. ఇలా అయితే వచ్చే ఐపీఎల్ లో నీ అడ్రస్ గల్లంతే
Kane Williamson : అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL) నుంచి తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టు, వన్డే, టి20 ఇలా ఫార్మాట్ ఏదైనా సరే పరుగులు సాధించడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు.
కేన్ విలియమ్సన్ (Kane Williamson).. న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ జట్టుకు ఆపద్భాందవుడు. టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ ఏదైనా సరే తన బ్యాటింగ్ ను దానికి తగ్గట్లు మార్చుకుంటూ పరుగులు సాధిస్తాడు.
2/ 6
అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL) నుంచి తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టు, వన్డే, టి20 ఇలా ఫార్మాట్ ఏదైనా సరే పరుగులు సాధించడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు.
3/ 6
తాజాగా వెస్టిండీస్ తో ముగిసి టి20 సిరీస్ లో కూడా విలియమ్సన్ తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయాడు. తొలి టి20లో 47 పరుగులతో రాణించాడు. దాంతో కేన్ మామా ఫామ్ లోకి వచ్చాడని అంతా అనుకున్నారు.
4/ 6
అయితే రెండో టి20లో 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే ఇతర ప్లేయర్ల వల్ల ఈ రెండు మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది.
5/ 6
ఇక మూడో టి20లో కేన్ విలియమ్సన్ మరోసారి తన టెస్టు తరహా బ్యాటింగ్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. 27 బంతులు ఆడిన అతడు కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు.
6/ 6
విలియమ్సన్ ఇదే రీతిన ఆడితే త్వరలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని వదిలే ప్రమాదం కూడా ఉంది. సన్ రైజర్స్ అతడిపై ఏకంగా రూ. 14 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. నిజాయితీగా చెప్పాలంటే విలియమ్సన్ ఫామ్ లోకి వచ్చినా వచ్చే సీజన్ లో అతడు హైదరాబాద్ కు ఆడేది డౌటే.