SuryaKumar Yadav : మిస్టర్ 360 నుంచి ఇటువంటి బ్యాటింగా? ఇలా జరగడం స్కై కెరీర్ లో తొలిసారేమో?
SuryaKumar Yadav : మిస్టర్ 360 నుంచి ఇటువంటి బ్యాటింగా? ఇలా జరగడం స్కై కెరీర్ లో తొలిసారేమో?
SuryaKumar Yadav : ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ రాణించాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో అర్ధ సెంచరీతో మెరిశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్ లో తడబడ్డాడు.
మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో న్యూజిలాండ్ (New Zealand) శుభారంభం చేసింది. భారత్ (India)తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా భారత పర్యటనలో కివీస్ తొలి విజయాన్ని అందుకుంది.
2/ 8
ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ రాణించాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో అర్ధ సెంచరీతో మెరిశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్ లో తడబడ్డాడు.
3/ 8
తొలి టి20లో సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ధనాధన్ ఆటకు సూర్యకుమార్ యాదవ్ పెట్టింది పేరు. బౌలర్ ఎవరైనా రెచ్చిపోయి ఆడతాడనే పేరుంది.
4/ 8
అయితే తొలి టి20లో సూర్యకుమార్ యాదవ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. స్పిన్ ను ఎదుర్కొనడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. 200 స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్ కేవలం 138 స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.
5/ 8
ఇక ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ను మిచెల్ సాంట్నెర్ తీవ్ర ఇబ్బంది పెట్టాడు. ఎంతలా అంటే 6వ ఓవర్ లో సూర్యకుమార్ స్ట్రయికింగ్ లో ఉండగా బౌలింగ్ కు వచ్చిన సాంట్నెర్ ఏకంగా మెయిడీన్ వేశాడు.
6/ 8
సూర్యకుమార్ స్ట్రయికింగ్ లో ఉంటే ప్రతి బంతికి సిక్సరో.. లేక ఫోరో వస్తుందని అభిమానులు అనుకుంటారు. అయితే వరుసగా ఆరు బంతులకు సూర్యకు కనీసం సింగిల్ కూడా తీయలేకపోయాడు.
7/ 8
2022 నుంచి టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టి20 బ్యాటర్ ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అయినా కివీస్ తో జరిగిన తొలి టి20లో పరుగుల కోసం సూర్యకుమార్ చాలా ఇబ్బంది పడ్డాడు.
8/ 8
కనీసం 180 స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేసేలా సూర్యకుమార్ తనకంటూ ఒక స్టాండర్డ్ ను సెట్ చేశాడు. దాంతో అతడు క్రీజులో ఉంటే బౌండరీల వర్షం కోసం అభిమానులు ఆశిస్తారు. అటువంటి సూర్యకుమార్ యాదవ్ కు మెయిడీన్ వేశాడంటే సాంట్నెర్ కు తప్పకుండా క్రెడిట్ ఇచ్చే తీరాలి.