T20 World Cup 2022 : ఇండియా, ఇంగ్లండ్ జట్లకు అంత సీన్ లేదు.. ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. యూనివర్సల్ బాస్ జోస్యం
T20 World Cup 2022 : ఇండియా, ఇంగ్లండ్ జట్లకు అంత సీన్ లేదు.. ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. యూనివర్సల్ బాస్ జోస్యం
T20 World Cup 2022 : ఈ క్రమంలో అక్టోబర్ 16 నుంచి 22 మధ్య గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 దశ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లు కూడా ఆరంభం అయ్యాయి.
నెల రోజుల పాటు క్రికెట్ లవర్స్ ను అలరించేందుకు పొట్టి ప్రపంచకప్ రెడీ అయ్యింది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది.
2/ 8
ఈ క్రమంలో అక్టోబర్ 16 నుంచి 22 మధ్య గ్రూప్ మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 దశ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లు కూడా ఆరంభం అయ్యాయి.
3/ 8
ఇక టి20 ప్రపంచకప్ పై వెస్టిండీస్ మాజీ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎడిషన్ టి20 ప్రపంచకప్ లో ఫైనల్ చేరే జట్ల గురించి టోర్నీ ఆరంభం కాకముందే తెలిపాడు.
4/ 8
టి20 ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్స్ గా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్ ఇంగ్లండ్ లు బరిలో ఉన్నాయి. డార్క్ హార్స్ గా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఇక అండర్ డాగ్స్ గా శ్రీలంక బరిలోకి దిగుతుంది.
5/ 8
అయితే టి20 ప్రపంచకప్ ఫైనలిస్టులపై గేల్ అభిప్రాయం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది. ఈసారి జరిగే టి20 ప్రపంచకప్ లో భారత్ ,ఇంగ్లండ్ కు అంత సీన్ లేదంటూ గేల్ వ్యాఖ్యానించాడు.
6/ 8
ఫైనల్ కు ఆస్ట్రేలియాతో పాటు వెస్టిండీస్ జట్లు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియా ఒకే కానీ, వెస్టిండీస్ ఫైనల్ కు చేరడమే వింతగా ఉందంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
7/ 8
ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఫామ్ లో లేదు. టి20 ప్రపంచకప్ ముందు జరిగిన మ్యాచ్ ల్లో పెద్దగా ఆడలేదు. ముఖ్యంగా జట్టులో అనుభవం లేని ప్లేయర్లే ఎక్కువగా ఉన్నారు. భారీ షాట్లు ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నా భాగస్వామ్యాలు నెలకొల్పే ప్లేయర్స్ లేరు.
8/ 8
ఇక ఫ్లయిట్ మిస్ అయిన షిమ్రన్ హెట్ మైర్ టి20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు. హెట్ మైర్ రెండు సార్లు ఫ్లయిట్ ను మిస్ చేసుకోవడాన్ని బట్టి చూస్తే వారు టి20 ప్రపంచకప్ పై ఎంత సిరీయస్ గా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి విండీస్ టీం ఫైనల్ చేరుతుందని గేల్ చెప్పడం వింతే మరీ.