NEERAJ CHOPRA TO BE HONOURED WITH PARAM VASHISTHA SEVA MEDAL SESR TRANSPG
Neeraj Chopra : నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం.. గోల్డెన్ బాయ్ కి విశిష్ట పురస్కారం..
Neeraj Chopra : నీరజ్ చోప్రా ఇప్పుడు ఈ పేరు తెలీని వారు లేరు. లేటెస్ట్ గా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది.
|
1/ 5
నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఇప్పుడు ఈ పేరు తెలీని వారు లేరు. ఈ భారత బంగారు ఆటగాడికి సంబంధించిన ప్రతి విషయమూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒలింపిక్స్ చరిత్రలో 121 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు నీరజ్.
2/ 5
ఇక, లేటెస్ట్ గా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది.
3/ 5
జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నీరజ్‌చోప్రాకు పతకం అందించనున్నాడు. ఇక ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు.
4/ 5
నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
5/ 5
ఇక, రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు.