ఇక ఇండియా విమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. సీనియర్లు వన్డే, టీ20 వరల్డ్‌కప్స్‌లో మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టారు. విమెన్స్‌లో ఐసీసీ తొలి ట్రోఫీని దేశానికి అందించి చరిత్రలో నిలిచే గోల్డెన్ చాన్స్ షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని యంగ్ టీమ్ ముందుంది. Image source BCCI
ఫస్ట్ ఎడిషన్ ఐసీసీ అండర్19 విమెన్స్ టీ20 వరల్డ్‌కప్ సాధించేందుకు షెఫాలీ, యంగ్‌స్టర్ త్రిష తదితరులు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. Image source Wisden Cricket Twitter
ఇవాళ జరిగే ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌ల్లో ఇండియా ఐదింటిలో నెగ్గింది. బ్యాటింగ్‌లో శ్వేత షెరావత్, బౌలింగ్‌లో పార్శవి చోప్రా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నారు. Image source BCCI
మరోవైపు ఇంగ్లండ్ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టైటిల్ ఫైట్‌కు వచ్చింది. బ్యాటింగ్‌లో స్క్రివెన్స్, బౌలింగ్‌లో హనా బేకర్ బాగా ఆడుతున్నారు. ఇండియన్స్ ముందుగా వీళ్లను కట్టడి చేయాలి. Image source ESPN CRICINFO