భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. క్రికెటర్లకు సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్ల విషయం కొత్తేమీ కాదు. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమాకు ఏదో తెలియని సంబంధం ఉంది. ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. స్టార్ క్రికెటర్లను గాఢంగా ప్రేమించారు. అయితే, కొన్ని కారణాల వల్ల వీరి బంధంతో పెళ్లి కాకుండానే ముగిసింది.
ఒకప్పుడు టీమిండియాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న యువరాజ్ సింగ్ కూడా క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మతో ప్రేమలో పడ్డాడు. కిమ్ శర్మ ఖడ్గం సినిమాలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాలో ఆడిపాడింది. కిమ్ శర్మకి, యువీకి ఇద్దరు కుటుంబ సభ్యులు అంగీకరించారు కూడా.
వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్ మన్ సర్ వివియన్ రిచర్డ్స్ మరియు బాలీవుడ్ నటి నీనా గుప్తాల ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్రెడీ మ్యారేజ్ అయిన రిచర్డ్స్ తో కొన్నేళ్లు పాటు సహజీవనం చేసింది నీనా గుప్తా. వీరి ప్రేమకు గుర్తుగా మసాబా అనే కూతురు కూడా ఉంది. మసాబా గుప్తా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.
నటి సాగరిక ఘట్గేను వివాహం చేసుకున్న మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, అంతకుముందు మరోనటి ఇషా శర్వాణితో సుదీర్ఘ కాలం ప్రేమాయణం నడిపాడు. 2005లో మొదలైన వీరి స్నేహం ఎనిమిదేళ్లపాటు సాగింది. వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పారు. అయితే, తర్వాత ఏవో కారణాలతో వీరి బంధం 2013లో ముగిసిపోయింది.
ఇక ప్లే బాయ్ అని బిరుదు ఉన్న రవిశాస్త్రి కూడా లవ్ ఎఫైర్ నడిపాడు. రవిశాస్త్రి, అమృతా సింగ్ గురించి అప్పట్లో మీడియా పెద్ద కూడై కూసింది కూడా. రవి ఆడే మ్యాచ్ లన్నింటికి అమృత హాజరయ్యేవారు. రవిని అమృత బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ వారి ప్రేమ ఎక్కువరోజులు సాగలేదు. అమృత బాలీవుడ్ నటుడు. తన కన్నా ఏడేళ్ల చిన్నవాడైన సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకోగా… రవిశాస్త్రి రీతూ సింగ్ ను పెళ్లాడాడు. కానీ ఈ రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. అమృత సైఫ్ నుంచి విడిపోగా… రవిశాస్త్రి వివాహం కూడా విడాకులతో ముగిసిపోయింది.
భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కూడా బాలీవుడ్ హీరోయిన్ల (Bollywood) తో ప్రేమాయణం నడిపాడు. ధోనీ, సాక్షి సింగ్ (Sakshi Dhoni) లు 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు అతడిపై పలు డేటింగ్ రూమర్స్ వెల్లువెత్తాయి. చాలా మంది హీరోయిన్స్ తో మనోడు డేటింగ్ చేశాడన్న వార్తలు హల్ చల్ చేశాయ్.
తమిళ చిత్ర రంగంలో స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకొన్న రాయ్ లక్ష్మీ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ధోని ఉన్న సమయంలో డేటింగ్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల అనంతరం జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్ లక్ష్మీ హాజరయ్యారు. అయితే 2008 నుంచి 2009 వరకు వారి అఫైర్ ఘాటుగా సాగింది. రాయ్ లక్ష్మీతో ఎంఎస్ ధోని డేటింగ్ వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందన్న టాక్ కూడా నడిచింది. అయితే ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ ఏడాదిలోపే బ్రేకప్ చెప్పుకున్నారు.