టీమిండియా క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్, మెడల్‌లతో డేటింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. పేర్లు చెప్పుకుంటూ పొతే.. ఈ జాబితా చాలా పెద్దిగానే ఉంది. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా-నటాషాలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారు. ఇదే బాటలో 23 ఏళ్ల ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ వెళ్తున్నాడా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.
ఇషాన్ కిషన్ , ప్రముఖ మోడల్ అదితి హుండియాను లవ్ చేస్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం ఉంది. 2019 లో ఐపీఎల్ లో ముంబై, చెన్నై మ్యాచ్ జరిగినప్పట్నుంచి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మ్యాచ్ లో ఇషాన్ ప్రదర్శనకు ఫిదా అయిన అదితి.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పొగిడేసింది. 'నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.
ఫ్యాషన్ ప్రపంచంలో అదితి హుండియా చాలా సుపరిచితమైన పేరు. 2017లో ఆమె ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా రాజస్థాన్‌గా ఎంపికైంది. ఆ తర్వాత 2018లో మిస్ దివా అవార్డు గెలుచుకున్నది. మిస్ ఇండియా సూప్రానేషనల్ కిరీటం గెలిచింది. ఆమె ఇండియా తరపున మిస్ సుప్రానేషనల్ కంటెస్ట్‌లో పోటీ చేయడానికి పోలాండ్ కూడా వెళ్లింది. (PC: Twitter)