త్వరలోనే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మొదలుకానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 టీమ్‌లు పోటీపడుతున్నాయి. డిసెంబర్ 23న కొచ్చిలో జరిగిన వేలంలో బెన్ స్టోక్స్, శామ్ కరన్, హ్యారీ బ్రూక్, కామెరాన్ గ్రీన్ వంటి ప్లేయర్స్ భారీ మొత్తాలను సొంతం చేసుకున్నారు. ఈ ఆటగాళ్లు తమ టీమ్‌లలో కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఈ ప్లేయర్స్ ఆధారంగా సీజన్లో ఆయా ఫ్రాంచైజీల ప్లాన్స్ ఉండే అవకాశం లేదు. కానీ కొంత మంది ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆధారపడ్డాయి. ఆ ఆటగాళ్ల ప్రదర్శననే ఎక్కువగా నమ్ముకున్నాయి. వారు దూరమైతే జట్టుకు అనేక రకాలుగా సమస్యలు తప్పవు. టీమ్ సభ్యుల ఎంపిక కూడా సమస్యగా మారుతుంది. ఆ ప్లేయర్స్ ఎవరు? ఆ ఫ్రాంచైజీలు ఏవో ఇప్పుడు చూద్దాం.
* జస్ప్రీత్ బుమ్రా(ముంబై ఇండియన్స్) : ముంబై ఇండియన్స్ పేస్ అటాక్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2022లో 7.18 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టాడు. అతని ఈసారి తోడుగా జోఫ్రా ఆర్చర్ ఉంటాడు. అయితే భారత ఫాస్ట్-బౌలింగ్ గ్రూప్ గత సంవత్సరం కంటే బలహీనంగా కనిపిస్తోంది. జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపిలను ముంబై వదులుకుంది. ఇండియన్ బౌలర్లను పెంచుకోవడంపై ముంబై ఆసక్తి చూపలేదు.
ప్రస్తుతానికి వారికి మహ్మద్ అర్షద్ ఖాన్, ఆకాష్ మధ్వల్ మాత్రమే స్పెషలిస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. ఆల్ రౌండర్ ఆప్షన్లుగా రమణదీప్ సింగ్, అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. బుమ్రా లేకపోతే ముంబైకి తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఐపీఎల్లో బుమ్రా ఫిట్‌గా లేకపోతే.. వన్డే ప్రపంచ కప్ ముందు రిస్క్ చేసే అవకాశం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి బుమ్రా లేకపోతే విలువైన సేవలు కోల్పోవడంతో పాటు జట్టు కూర్పు సమస్య ఎదుర్కొంటుంది.
* హార్దిక్ పాండ్యా(గుజరాత్ టైటాన్స్ ) : గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్యా అద్భుతంగా నడిపించాడు. ఆల్-రౌండర్‌గా, కెప్టెన్‌గా టైటిల్‌ను గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్ కోసం పాండ్యా పాత్రను కొద్దిమంది మాత్రమే పోషించగలరు. టాప్ ఫోర్లో బ్యాటింగ్ చేస్తే, కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, బౌలింగ్ చేయగలడు. ఆల్‌రౌండర్‌గా అంతంత మాత్రమే రాణిస్తున్నా టైటాన్స్ విజయ్ శంకర్‌ను సెలక్ట్ చేసుకుంది. కానీ అతను ప్రపంచంలోని అత్యుత్తమ T20 ఆల్రౌండర్లలో ఒకరైన పాండ్యా స్థాయిలో సేవలు అందించలేడు. GT ప్రదర్శన పూర్తిగా పాండ్యాపై ఆధారపడింది.
* రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్) : ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ IPL 2023కి దూరంగా ఉంటాడని జట్టు సహాయక సిబ్బంది ధృవీకరించారు. రిషబ్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టాలు తప్పవు. కెప్టెన్‌గా కాకుండా, జట్టులో పంత్ మాత్రమే స్పెషలిస్ట్ ఇండియన్ వికెట్ కీపర్. సర్ఫరాజ్ ఖాన్ పార్ట్-టైమ్ కీపింగ్ ఒక్కటే DCకి ఉన్న ఏకైక మార్గం.
ఫిల్ సాల్ట్‌ని చేర్చుకోవడం వల్ల ఓవర్సీస్ కాంబినేషన్లో ప్రధానంగా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. క్యాపిటల్స్ నాణ్యమైన అమ్ముడుపోని కీపర్‌ను తీసుకోవడానికి ఒప్పందం చేసుకోకపోతే.. ఢిల్లీకి జట్టు కూర్పు కష్టమవతుంది. DC సమస్యలు అక్కడితో అయిపోలేదు. మిడిల్ ఆర్డర్లో నమ్మకమైన బ్యాటర్లు మాత్రమే కాకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కూడా తక్కువగా ఉన్నారు. అక్షర్ పటేల్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారం. ఢిల్లీ పంత్‌పై ఎక్కువగా ఆధారపడింది, అతను దూరమవడంతో కష్టాలు మొదలయ్యాయి.