అయితే ముంబై ఫ్యాన్స్ మాత్రం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీపై ఆసక్తి కనబరుస్తున్నారు. గత సీజన్ నుంచే అర్జున్ జట్టుతో ఉంటున్నా ఇప్పటి వరకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. సోకీన్, కుమర్ కార్తికేయ సింగ్ లాంటి ప్లేయర్స్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసినా కూడా అర్జున్ టెండూల్కర్ ను ఒక్క మ్యాచ్ లో కూడా తీసుకోకపోవడంతో సచిన్ అభిమానులు ముంబై జట్టుపై ఆగ్రహంతో ఉన్నారు.
ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే తాము వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు. అందులో భాగంగానే తమ బెంచ్ ను పరీక్షిస్తున్నామంటూ కామెంట్స్ చేశాడు. తర్వాతి మ్యాచ్ లోనూ మార్పులు ఉంటాయని రోహిత్ పేర్కొన్నాడు. ఈ లెక్కన తదుపరి మ్యాచ్ లో అర్జున్ ఎంట్రీ తప్పక ఉంటుందని సచిన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.