ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పేలవ ఆటతీరు కనబర్చిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 3 మ్యాచ్ ల్లోనే గెలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) టీం.. ఏకంగా 11 మ్యాచ్ ల్లో ఓడి 6 పాయింట్లతో లీగ్ టేబుల్ లో ఆఖరి స్థానంలో నిలిచింది.