ఈ మధ్య ధోనీ ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో కూడా తెగ వైరలవుతోంది. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ఇక పంటను పరిశీలించే క్రమంలో స్ట్రాబెర్రీలను చూసిన ధోనీ ఆగలేక వాటిని తెంచి తిన్నాడు. దానికి 'నేను స్ట్రాబెర్రీ పొలంలో తిరిగితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు'అని సెటైరిక్‌గా క్యాప్షన్ ఇచ్చాడు. అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో ఈ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక ఎన్నడు లేని విధంగా మహీ సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నెట్టింట వైరల్ అయింది.