టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌లో విజయాలు అందించిన కెప్టెన్ ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం మహెంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni). పించ్ హిట్టర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నది. ఒకవైపు క్రికెట్లో రాణిస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలో ధోని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. (Photo Credit : Instagram)
భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు ధోని. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతోనే కాదు.. తన స్టైల్ తోను అభిమానులను సంపాదించుకున్నాడు. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోని ఓ స్టయిల్ ఐకాన్ లా ఉండేవాడు..జులపాల జట్టుతో అభిమానులను అలరించేవాడు. ఆ తరువాత ఫంకీ ఎయిర్ స్టైల్ తో కూడా తన మార్క్ చూపించాడు.. (Photo Credit : Instagram)
ఇప్పుడు కొత్త హెయిర్ స్టయిల్ తో ఫ్యాన్స్‌కు కిక్కెక్కిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ధోనీ హెయిర్స్టయిలిస్టు ఆలిమ్ హక్కిమ్ తలైవా ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (Photo Credit : Instagram)
లైట్‌గా గడ్డం.. ఫంకీ హెయిర్‌స్టయిల్‌తో ధోనీ దిగిన ఫోటో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆ ఫోటోకు ఓ ఎమోజీతో కామెంట్ చేశాడు. ఇక అభిమాని అయితే.. ధోనీ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నట్లు కామెంట్ పెట్టాడు. ఐపీఎల్లో చెన్నై టీమ్‌తో ఆడుతున్న ధోనీ.. గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. (Photo Credit : Instagram)