దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మణిపూరి నిప్పుకణిక మీరాబాయి చాను రజతంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి.. భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది. అయితే, మీరాబాయి చానుకు, ధోనీకి పోలీకలున్నాయ్. ఈ ఇద్దరూ కష్టాల కడలి నుంచి తమ గెలుపుకు బాటలు వేసుకున్నవారే.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పెద్దగా విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో సత్తా చాటిందే లేదు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి భారత్ పోటీపడింది. అప్పటి నుంచి ప్రస్తుతం జరగుతున్న టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు భారత్ సాధించింది ఒకే ఒక్క మెడల్. అది కూడా మన తెలుగు తేజం కరణం మళ్లీశ్వరీ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆమె తర్వాత మళ్లీ భారత్‌కు మీరాబాయి చాను రూపంలో పతకం దక్కింది.
అయితే మీరాబాయి సోదరులు, కజిన్స్ ఫుట్‌బాల్ ఆడి మురికిగా మారేవారని, దాంతో శుభ్రంగా ఉండే ఆటలను ఎంచుకోవాలని తొలుత భావించింది. ఈ క్రమంలోనే నీట్‌గా స్టైలీష్‌గా ఉండే ఆర్చర్ కావాలనుకుంది. కానీ మణీపూర్ వెయిట్ లిఫ్టర్ కుంజరణి దేవీని చూసి మీరాబాయి తన మనసును మార్చుకుంది. ఆమెను స్పూర్తిగా తీసుకున్న చాను.. వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
ఆ పెర్ఫామెన్స్ అనంతరం అమెరికా వెళ్లి 45 రోజుల ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన చాను.. క్లీన్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తి వరల్డ్ రికార్డు సృష్టించింది. స్కాచ్‌లో 86 కేజీల బరువు మోసింది. అంతకు ముందు 2018 కాన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తనపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టోక్యోలో మెరిసి విశ్వవేదికపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించింది.