ఇక యావత్ భారత్ 75వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా జరుపుకుంటన్న సందర్భంలో హసిన్ జహాన్ ఓ వింత వాదనను తెరపైకి తీసుకొచ్చింది. దేశం పేరు మార్చాలని ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన హసిన జహాన్.. అందులో సంతల్య్, సోనియాలతో కలిసి ఆమె ప్రముఖ బాలీవుడ్ గీతం 'దేశ్ రంగీలా' పాటకు నృత్యం చేసింది. (PC : TWITTER)
దీనిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హసిన్ జహాన్.. 'మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మనదేశం పేరు 'భారత్' లేదా హిందూస్తాన్ అని మాత్రమే ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం మనం పిలుస్తున్న 'ఇండియా' పేరు మార్చి 'భారత్' అని గానీ, 'హిందుస్తాన్' అని గానీ పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం మన దేశాన్ని అదే పేరుతో పిలుస్తుంది.' అని పోస్ట్ చేసింది. (PC : INSTAGRAM)