భారత జాతీయ క్రీడ హాకీ (Hockey).. పేరుకు హాకీ అయినప్పటికీ ఇక్కడి జనాలకు క్రికెట్ (Cricket) అంటేనే ప్రాణం.. క్రికెట్‌ను మతం కన్నా ఎక్కువగా ఆరాధిస్తారు. అభిమానిస్తారు. అలాంటి క్రికెట్ లో సచిన్ (Sachin Tendulkar) క్రికెట్ దేవుడిగా కోలుస్తారు అభిమానులు. పురుషుల క్రికెట్ లో సచిన్ వేసిన ముద్ర అలాంటిది.
ఇక, సచిన్ కన్నా ఎక్కువగానే మహిళల క్రికెట్ లో తన మార్క్ చూపించింది మిథాలీ రాజ్ (Mithali Raj). ఈ హైదరబాదీ తన సొగసరి ఆటతో మహిళల క్రికెట్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ .టెస్ట్ టు వన్డే.. ఆ ఫార్మాట్.. ఈ ఫార్మాట్ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.
మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. క్రికెట్లో ఎంట్రీ కాకపోయుంటే..భరతనాట్యంలో ప్రావీణ్యురాలై ఉండేది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది.