మహిళల ODI ప్రపంచ కప్ (2022 Womens Cricket World Cup)ను ICC వచ్చే నెలలో నిర్వహించనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌లో టోర్నీ జరగనుంది. అంతకుముందు మిథాలీ రాజ్ జట్టు వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లింది. అయితే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ సిరీస్ లో 39 ఏళ్ల వయసులోనూ తన విధ్వంసకర ఆటతో అదరగొట్టింది మిథాలీ రాజ్(AFP)
అయితే, కీలక ప్రపంచకప్‌కు ముందు ఈ విజయం టీమిండియాకు చాలా కీలకం. అయితే, తన హాఫ్ సెంచరీతో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది మిథాలీ. కెప్టెన్ గా మిథాలీ రాజ్ 50 సార్లు వన్డేల్లో 50 పరుగులకు పైగా ఇన్నింగ్సులు ఆడింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ మిథాలీనే. ఇక, మెన్స్ క్రికెట్ లోనూ ఈ రికార్డును కేవలం ఇద్దరు క్రికెటర్లు మాత్రమే చేయగలిగారు.(AFP)