ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించారు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని కేటీఆర్ పోస్ట్ చేశారు. ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని కొనియాడారు. రోజు రోజుకు ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.