ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి ఫైనల్ కాగా.. రెండోది సెమీఫైనల్ లాంటి క్వాలిఫయర్ 2. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన పోరులో ఓడిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans).. లక్నో సూపర్ జెయింట్స్ పై నెగ్గిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.