ఆ పోస్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. టీమిండియా క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోయి ఫ్యాట్‌గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయ్. (Source: Cricket Memes)