టీమిండియా విజయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ లు కీ రోల్ ప్లే చేశారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో చెలరేగి టీమిండియా మంచి స్కోరు అందించారు. ఇక, అర్ష్ దీప్ సింగ్ కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించాడు. (Twitter)
అయితే, అడిలైడ్ మైదానం తడిగా ఉండటంతో.. టీమిండియా ఆటగాళ్లు ఇబ్బందులకు గురయ్యారు. చిత్తడిగా ఉండటంతో ఆటగాళ్ల షూస్ స్పైక్స్ కు బురద అంటుకుంది. దీంతో.. ఆటగాళ్లు మైదానంలో వేగంగా కదలడానికి ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆటగాళ్లు ఇబ్బందులు పడకుండా షూస్ ను క్లీన్ చేశారు రఘు. దీంతో.. ఆటగాళ్లు మైదానంలో స్లిప్ అవ్వలేదు. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ లో కీలక సభ్యుడై ఉండి కూడా ఈ పని చేసిన రఘును అందరూ అభినందిస్తున్నారు. (Twitter)
రాఘవేంద్ర సైడ్ ఆర్మ్ పరికరం సాయంతో నెట్స్ లో విసిరే బంతులను ప్రాక్టీసు చేయడంతో టీమిండియా బ్యాట్స్ మన్లు పేసర్లను ఆడే విధానంలో బాగా పరిణతి చెందారు. రాఘవేంద్ర నెట్స్ లో విసిరే బంతులు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంటాయి. ఏదో గుడ్డిగా బంతులు విసరకుండా, ఆటగాళ్ల ఫుట్ వర్క్, బ్యాట్ కదలికలను దృష్టిలో ఉంచుకుని త్రోడౌన్లు విసురుతుంటాడు రఘు. (Twitter)
ఇలా, రఘు టీమిండియా విజయాల్లో ఓ అన్ సంగ్ హీరో అనే చెప్పుకోవచ్చు. సాధారణంగా క్రికెట్ జట్లు నెట్ ప్రాక్టీసు సమయంలో సైడ్ ఆర్మ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తుంటాయి. సైడ్ ఆర్మ్ పరికరాన్ని చేత్తో పట్టుకుని విసిరితే బంతి విపరీతమైన వేగంతో దూసుకెళుతుంది. సైడ్ ఆర్మ్ పరికరం చివర్లో ఉండే స్పూన్ వంటి నిర్మాణంలో బంతిని ఉంచి విసురుతారు. (Twitter)