అనామకుడిగా ఐపీఎల్‌లోకి వచ్చిన హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్.. ఇప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్ అయ్యాడు. సీనియర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జాస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీతో పోటీపడి మరి.. వికెట్లు తీస్తున్నాడు. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్రపోషిస్తున్నాడు. అనతికాలంలోనే సిరాజ్‌కు దేశ సరిహద్దుకు ఆవల కూడా అభిమానం పెరుగుతున్నది. తాజాగా, పాకిస్తాన్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ యాంకర్, జర్నలిస్టు జైనాబ్ అబ్బాస్ కూడా ఈ లిస్ట్ లో చేరారు. (Twitter)
"మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ శ్రేణి బౌలర్‌గా రాణిస్తున్నారు. గతేడాది ఆస్ట్రేలియా టూర్లో, అలాగే, తాజా లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆయన వికెట్లు కొల్లగొట్టిన వైనం అద్భుతం. మంచి స్పీడ్‌తో బాల్ వేస్తున్న సిరాజ్ బంతిని తన అదుపులో ఉంచుకోవడంలో దిట్ట. ఆయన లైన్ అండ్ లెంగ్త్ అమేజింగ్ " అని జైనాబ్ అబ్బాస్ పొగడ్తలు కురిపించింది. (Twitter)