ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangalore) స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn maxwell) భారత అల్లుడయ్యాడు. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న భారత సంతతికి చెందిన తమిళ అమ్మాయి వినీ రామన్ ను తమిళ సంప్రదాయంలో ఈ నెల 27న వివాహాం చేసుకున్నాడు. (PC: INSTAGRAM)
వినీ రామన్ భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ పౌరురాలు. ఆమె అక్కడ ఫార్మసిస్ట్ (ఔషధ నిపుణురాలు)గా పనిచేస్తోంది. 2017 నుంచే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వీరు పెట్టిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 2019, 20లలో ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డు ఫంక్షన్లో మ్యాక్స్‌వెల్‌తో కలిసి వినీ రామన్ హాజరై సందడి చేసింది కూడా. మైదానంలో ప్రత్యర్థులకు పట్ట పగలే చుక్కులు చూపించే మ్యాక్స్‌వెల్... మన అమ్మాయి చూపులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. (PC: INSTAGRAM)