మందిరా బేడీ (Mandira Bedi) మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. మందిరా బేడీ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)లో చేరింది. రాజస్థాన్ రాయల్స్ అండ్ కలర్స్ 'క్రికెట్ కా టికెట్' అనే కొత్త రియాల్టీ షోతో ముందుకు వస్తున్నాయి. మందిరా బేడీ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా అలరించనుంది. (Mandira Bedi/Instagram)
ఈ షో దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రికెట్ ప్రతిభను గుర్తించడం కోసం రూపొందించారు. ఇందులో ఆడవాళ్లు, మగవాళ్లు కూడా పాల్గొనొచ్చు. ఇద్దరికీ సమానంగా ఛాన్స్ ఇస్తారు. క్రికెట్ కెరీర్‌గా కావాలనుకున్నవాళ్లు ఈ హంట్ కి అప్లికేషన్ ఇవ్వొచ్చు. ఇక.. చాలా కాలంగా క్రికెట్ షోలకు దూరంగా ఉన్న మందిరా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (Mandira Bedi/Instagram)
మందిరా బేడీ 2003 ICC ప్రపంచ కప్‌లో అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ మాక్స్ యొక్క ప్రత్యేక కార్యక్రమం 'ఎక్స్ట్రా ఇన్నింగ్స్'కి మొదట వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ మెగాటోర్నీలో సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా ఫైనల్ చేరింది. అయితే.. ఈ ప్రపంచకప్ లో మందిరా బేడీ యాంకరింగ్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. (Mandira Bedi/Instagram)
మందిరా బేడీ క్రికెట్ షోకి ప్రత్యేక గ్లామర్ ని జోడించారు. అయితే 19 ఏళ్ల తర్వాత మందిరా బేడీ కూడా స్పోర్ట్స్ యాంకరింగ్‌కు సంబంధించిన చేదు అనుభవాలను పంచుకుంది. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా మాట్లాడుతూ... నేను యాంకరింగ్ చేసేటప్పుడు క్రికెటర్లు నన్ను తదేకంగా చూసేవారని ఆమె ఆరోపించింది. (Mandira Bedi/Instagram)
ఇప్పుడు 50 ఏళ్ల వయస్సులో కూడా మందిరా బేడీ మరోసారి క్రికెట్ షో హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె దానికి గ్లామర్ జోడించబోతోంది. ఎందుకంటే మందిరాకు 50 ఏళ్లు వచ్చినా.. ఆమె ఫిట్నెస్ చూసి క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 50 ఏళ్ల వయసులో కూడా మందిరా ఫిట్నెస్ విషయంలో తగ్గేదేలే అంటుంది.(Mandira Bedi/Instagram)