ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కూడా చెన్నై టీమ్‌ను బెదరగొట్టాడు. చెన్నైతో 13 మ్యాచ్‌లు ఆడిన జహీర్.. 16 వికెట్లు తీశాడు. ధోనీని ఎక్కువసార్లు పెవిలియన్ పంపించాడు.