KOLKATA KNIGHT RIDERS SUNIL NARINE BECOMES 2ND OVERSEAS PLAYER TO EARN 100 CR FROM IPL SALARY JNK
IPL 2022: ఐపీఎల్ సంపాదనలో చరిత్ర సృష్టించిన సునిల్ నరైన్.. ఇంతకు ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ఎంత సంపాదించాడంటే..!
IPL 2022: ఏబీ డివిలియర్స్ తర్వాత ఐపీఎల్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్న విదేశీ ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో రూ.100 కోట్ల మార్కును దాటనున్నాడు. ఆల్ రౌండర్ నరైన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపిఎల్ 2022 కోసం కొనసాగించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతున్నాడు. అతను IPL 2022లో KKR కోసం వరుసగా 11వ సీజన్ ఆడనున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రూ.100 కోట్ల వేతనాన్ని దాటిన రెండో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. (PC:Sunil Narine instagram)
2/ 6
KKR ఆల్ రౌండర్ నరేన్ IPL 2021 వరకు రూ. 95.2 కోట్ల వేతనం పొందాడు. IPL 2022 కోసం KKR అతనిని 6 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్నది. (PC:Sunil Narine instagram)
3/ 6
ఈ సీజన్‌తో నరేన్ ఐపీఎల్ సంపాదనలో రూ.100 కోట్ల క్లబ్లో చేరనున్నాడు.15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏబీ డివిలియర్స్ తర్వాత రూ.100 కోట్లు రాబట్టిన రెండో విదేశీ ఆటగాడిగా నరేన్ నిలిచాడు.(PC:Sunil Narine instagram)
4/ 6
నరైన్ KKRతో 10 సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ కోసం 134 మ్యాచ్‌లు ఆడాడు. గత పదేళ్లలో 954 పరుగులు చేయడమే కాకుండా 143 వికెట్లు తీసుకున్నాడు. (PC:Sunil Narine instagram)
5/ 6
రూ. 100 కోట్ల ఐపీఎల్ వేతనం గురించి చెప్పాలంటే. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఎబి డివిలియర్స్ ఇప్పటికే ఈ క్లబ్లో చేరారు తాజాగా నరేన్ ఈ క్లబ్లో చేరనున్నారు.(PC:Sunil Narine instagram)