గత మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం వారు దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది సునీల్ శెట్టి మరియు అతని భార్య మనా శెట్టి పెళ్లికి సన్నాహాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. (Image Credit : Instagram)
ఇక 2019 డిసెంబర్ లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణం వీరిద్దరు కూడా 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దాంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఎదో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు. (Image Credit : Instagram)
అంతేకాక.. వీరిద్దరి లవ్ స్టోరీలో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేశాడు. ఈ జంట గురించి కథనాలు వచ్చినప్పుడు.. వీరిద్దర్ని వెనుకేసుకొచ్చాడు సునీల్. అంతేగాక, కొడుకు రోహన్ శెట్టి కూడా కేఎల్ రాహుల్ తో కలిసి ఇంగ్లండ్ టూర్ లో షికార్లు చేశాడు. అలాగే, రాహుల్ ఇంగ్లండ్ టూర్ లో రాణించినప్పుడు సునీల్ శెట్టి అతణ్ని పొగడ్తలతో ముంచెత్తాడు. (Image Credit : Instagram)
ఇక అక్కడి నుంచి వీరు తమ రిలేషన్ ను ఎక్కడా దాచే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా అతియా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ను రాహుల్ ఫోటోలతో ముంచేసింది. ఇక, కేఎల్ రాహుల్ ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్కు ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ టోర్నమెంట్ ముగిసిన తరువాత కేఎల్ రాహుల్.. పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. (Image Credit : Instagram)