KL Rahul - Athiya Shetty Wedding : రాహుల్-అతియా శెట్టి పెళ్లి బాజాలు మోగేది నేడే.. పెళ్లిలో ‘నో ఫోన్ పాలసీ’.. ముహూర్తం ఎన్ని గంటలకంటే?
KL Rahul - Athiya Shetty Wedding : రాహుల్-అతియా శెట్టి పెళ్లి బాజాలు మోగేది నేడే.. పెళ్లిలో ‘నో ఫోన్ పాలసీ’.. ముహూర్తం ఎన్ని గంటలకంటే?
KL Rahul - Athiya Shetty Wedding : అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగేలా బాలీవుడ్ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు. ముంబైలోని తన నివాసం ఖండాలాలోని ఫామ్ హౌస్ జహన్ లో వీరి వివాహం జరగనుంది.
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న బాలీవుడ్ నటి అతియా శెట్టి (Athiya Shetty)ని నేడు(జనవరి 23) పెళ్లి చేసుకోనున్నాడు.
2/ 7
అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగేలా బాలీవుడ్ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు. ముంబైలోని తన నివాసం ఖండాలాలోని ఫామ్ హౌస్ జహన్ లో వీరి వివాహం జరగనుంది.
3/ 7
జనవరి 21 నుంచే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక ఈ పెళ్లిలో దక్షిణాది వంటకాలను వడ్డించనున్నారు. అరటి ఆకుల్లో భోజనం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
4/ 7
ఇక ఈ వివాహానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలో ‘నో ఫోన్ పాలసీ’ అమలు కానున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా సునీల్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
5/ 7
సోమవారం సాయంత్రం 4 గంటలకు రాహుల్.. అతియా శెట్టి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. హిందూ సంప్రాదాయ పద్దతిలో పెళ్లి జరగనుంది.
6/ 7
ఇక పెళ్లి అనంతరం ముంబై వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ చేయనున్నారు. దాదాపు 3 వేల మంది అతిథులతో ఈ రిసెప్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది.
7/ 7
ప్రస్తుతం భారత్.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం టి20 సిరీస్ ఆడుతుంది. పెళ్లి కారణంగా రాహుల్ ఈ రెండు సిరీస్ లకు దూరంగా ఉన్నాడు. అయితే ఫ్రిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడు.