టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) పెళ్లిపై గత కొంతకాలంగా చర్చనడుస్తోంది. అయితే తాజాగా అతడి పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి (Athiya Shetty)ని జనవరి 23న కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోనున్నాడు. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక 2019 డిసెంబర్ లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణం వీరిద్దరు కూడా 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దాంతో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ మధ్య ఎదో జరుగుతుందని చాలా మంది అనుకున్నారు.
ఇక 2021లో ఇంగ్లండ్ సిరీస్ కు ముందు బీసీసీఐకి అతియాని తన భాగస్వామిగా చెప్పి.. ఆ టూర్ కి తీసుకెళ్లాడు. సౌత్ ఇండియాకు చెందిన సునీల్ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమకి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అంతేకాక.. వీరిద్దరి లవ్ స్టోరీలో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేశాడు. ఈ జంట గురించి కథనాలు వచ్చినప్పుడు.. వీరిద్దర్ని వెనుకేసుకొచ్చాడు సునీల్. అంతేగాక, కొడుకు రోహన్ శెట్టి కూడా కేఎల్ రాహుల్ తో కలిసి ఇంగ్లండ్ టూర్ లో షికార్లు చేశాడు. అలాగే, రాహుల్ ఇంగ్లండ్ టూర్ లో రాణించినప్పుడు సునీల్ శెట్టి అతణ్ని పొగడ్తలతో ముంచెత్తాడు.