ఐపీఎల్ 2021లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సరికొత్తగా కనపించనుంది. ఈసారి ఐపీఎల్లో కొత్త పేరు మరియు కొత్త లోగోతో ఆడనుంది.
2/ 6
గత సీజన్లో ఆరభంలో ఏడు మ్యాచ్ల్లో 6 ఓటములను చవిచూసింది. తిరిగి పుంజుకుని ప్లేఆఫ్ రేసులో నిలిచింది.
3/ 6
కానీ చివరిలో మళ్ళీ విఫలమై ఫ్లేఆప్ రేసు నుంచి నిష్కరమించింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం ప్రక్షాళన మెుదలుపెట్టింది. గ్లెన్ మాక్స్వెల్, కరుణ్ నాయర్, ముజిబ్ ఉర్ రెహ్మాన్ మరియు షెల్డన్ కాట్రెల్ సహా 9 మంది ఆటగాళ్లను తొలగించింది.
4/ 6
ప్రస్తుతం పంజాబ్ ఫ్రాంచైజీ దగ్గర రూ. 53.20 కోట్ల ఫడింగ్ ఉంది. ఈసారి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయలనే ప్లాన్ చెస్తుంది. కింగ్స్ ఎలెవన్ ఐపిఎల్ 2021 లో బలమైన జట్టుగా అవతరించే అవకాశం ఉంది.
5/ 6
ఈసారి కూడా కెఎల్ రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. అలాగే పంజాబ్ పూర్తిగా కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే పంజాబ్ జట్టు కొత్త పేరు వైరల్గా మారింది. త్వరలో అధికారిక లోగో విడుదల అవుతుంది.
6/ 6
గత 13 సీజన్లలో ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ జట్టు.. ఈసారి టైటిల్ సాధించలనే పట్టుదలతో ఉంది. తాజా ప్రయోగాలైన జట్టు తలరాత మారుస్తుందో లేదో చూడాలి.