కోహ్లి వన్డే కెప్టెన్సీ వివాదం భారత క్రికెట్ లో సంచలనం సృష్టించిందో తెలుసు. గంగూలీ వర్సెస్ కోహ్లీ (Kohli Vs Ganguly) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవలు ఉన్నాయంటూ వార్తలు హల్చల్ చేశాయ్. దక్షిణాఫ్రికా పర్యటన కంటే ముందే బీసీసీఐ..విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది.
తాజాగా ఈ అంశంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు.. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరోసారి స్పందించాడు. " కోహ్లి, గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వాళ్లిద్దరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటే మంచిది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నా " అని పేర్కొన్నాడు.