ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతను భారత్‌తో సిరీస్‌లో రీషెడ్యూల్ చేయబడిన 5వ టెస్ట్ మ్యాచ్ (IND vs ENG 5వ టెస్ట్) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఈ టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్ కూడా 2-2తో సమమైంది. (AP)
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 378 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. మాజీ కెప్టెన్ జో రూట్, ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో 269 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రూట్ 142, జానీ బెయిర్‌స్టో 114 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగారు. బెయిర్‌స్టో తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేశాడు. (AP)
ఇక, ఈ మ్యాచులో బెయిర్‌స్టో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. బెయిర్‌స్టో గత 5 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో నాటింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేశాడు. ఆ తర్వాత లీడ్స్‌లో న్యూజిలాండ్‌పై 162 మరియు 71 పరుగులతో దుమ్మురేపాడు. ఇప్పుడు భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేశాడు. (England Cricket Twitter)