టీమిండియా స్టార్ పేసర్.. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) గత నెలలో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. టీవి యాంకర్.. సంజనా గణేశన్ (Sanjana Ganesan) ని పెళ్లి చేసుకున్నాడు బుమ్రా. పెళ్లి తర్వాత వాళ్ల విధుల్లో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు దంపతులు. స్పోర్ట్స్ యాంకర్ గా సంజనా విధులు నిర్వహిస్తుండగా స్తుండగా.. ఐపీఎలో బిజీ బిజీగా ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా.
ముంబై ఇండియన్స్ జట్టుతో సభ్యుడైన బుమ్రా ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. మొదటి ఐదు లీగ్ మ్యాచ్ ల్ని అక్కడ ఆడనున్నాడు. 2016న అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించిన బుమ్రా.. అప్పటి నుంచి టీమిండియాలో కీలక ప్లేయర్ గా నిలిచాడు. టీమిండియా తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 ఆడాడు. బుమ్రా 111 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీలో 27 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఆ ట్రోపీ ముంబై ఇండియన్స్ కైవసం చేసుకోవడంలో కీ రోల్ ప్లే చేశాడు.