క్రీడలను ముఖ్యంగా క్రికెట్‌ను అభిమానించే వారికి సంజనా గణేశన్ పరిచయమే (Sanjana Ganesan). ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్, బ్యాడ్‌మింటన్ టోర్నమెంట్ల సందర్భంగా పలు స్పేషల్ షోలు హోస్ట్ చేశారు సంజన. ఇక, టీమిండియా స్పీడ్ స్టార్ బుమ్రాను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకుని వార్తల్లో ట్రెండింగ్ నిలిచింది సంజనా గణేశన్. లేటెస్ట్ గా సముద్రంలో మధ్యలో ఎంజాయ్ చేస్తోంది చిల్ అవుతోంది సంజనా గణేశన్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. (Photo Credit : Instagram)
సంజనా గణేశన్ స్వస్థలం పుణె. 1991 మే 6న ఆమె జన్మించారు. అక్కడే బీటెక్ వరకు చదివారు. మోడలింగ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. (Photo Credit : Instagram)