Home » photogallery » sports »

JAPAN FANS CLEAN UP FIFA WORLD CUP STADIUMS

స్టేడియాల్లో చెత్త కనిపిస్తే చాలు..శుభ్రం చేసేస్తున్నారు.

2018 ఫిఫా ప్రపంచకప్‌‌ పోటీలను చూసేందుకు 32 దేశాలకు చెందిన అభిమానులు మాత్రమే కాదు,ఇతర దేశాల నుంచి లక్షల సంఖ్యలో రష్యాకు వచ్చారు.మిగతా దేశాల ఫ్యాన్స్ స్టేడియంలో మ్యాచ్‌లు చూసి,ఆ తర్వాత హుందాగా బయటకు వచ్చేస్తున్నారు.కానీ జపాన్ ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్‌లు పూర్తయ్యాక స్టేడియంలోనే ఉండి,అక్కడ స్టాండ్స్‌లో ఉన్న చెత్తను సేకరించి,జాగ్రత్తగా బయటపడేస్తున్నారు.పోలాండ్‌తో జపాన్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఓల్గోగ్రాడ్ స్టేడియంలో చెత్తను సేకరించి తమ పెద్ద మనసు చాటుకున్నారు.జపాన్ అభిమానుల సేవా భావాన్ని స్పూర్తిగా తీసుకుని మిగతా దేశాల ఫ్యాన్స్ సైతం ఇదే బాట పడుతున్నారు.