సినిమా క్లైమాక్స్ ను తలపించిన ఫైనల్ మ్యాచ్ లో ఫుట్ బాల్ (Hyderabad) క్లబ్ దుమ్ము లేపింది. ఆఖరి మూడు నిమిషాల వరకు ఓటమి అంచున ఉన్న జట్టు చివర్లో దూకుడు కనబరిచి చాంపియన్ గా నిలిచింది. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2021 2022 సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ ఎఫ్ సీ పెనాల్టీ షూటౌట్ లో 3-1 తేడాతో బ్లాస్టర్స్ (kerala blasters)పై ఘన విజయం సాధించింది.
అనంతరం హైదరాబాద్ జట్టు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే మ్యాచ్ ముగియడానికి వచ్చేసింది. అయితే ఇక్కడే ట్విస్ట్. 88వ నిమిషంలో హైదరాబాద్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్ సాహిల్ తవోరా సూపర్ షాట్ తో బంతిని గోల్ పోస్టులోకి నెట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. అనంతరం మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలోనూ ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
చిరంజీవి భోళా శంకర్" width="1600" height="1600" /> అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కేరళ బ్లాస్టర్స్ ఓనర్స్ లో ఒకరుగా మన మెగాస్టార్ (chiranjeevi) చిరంజీవి ఉన్నారు. దాంతో హైదరాబాద్ చేతిలో చిరంజీవి టీం ఓడిపోయిందని అతడి అభిమానులు బాధ పడుతున్నారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కూడా కేరళ బ్లాస్టర్స్ ఓనర్స్ లో ఒకరు కావడం విశేషం.