రోహిత్ రైట్ హ్యాండ్ ప్లేయర్ కావడం ఇషాన్ కిషన్ లెఫ్టాండ్ ప్లేయర్ కావడంతో వీరిద్దరినీ ఓపెనింగ్ కు పంపే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జరిగితే రాహుల్ తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకోవాల్సి వస్తుంది. అయితే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, జడేజాలతో ఏడో నంబర్ వరకు భారత బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. దాంతో రాహుల్ బెంచ్ కే పరిమితం అయ్యే చాన్స్ ఉంటుంది.