గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీకి ఏదీ కలిసి రావట్లేదు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తుందనుకున్న భారత్.. అటు ప్రేక్షకులను.. ఇటు బీసీసీఐని పూర్తిగా నిరాశపరిచింది. పేలవమైన ఫామ్‌తో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కుంది. దీనితో టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమణకు దగ్గరైంది.
మరోవైపు.. త్వరలోనే టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపడతారు. ద్రావిడ్ కు వీలుగా ఉండేందుకు.. వన్డే, టీ-20 లకు ఒకే కెప్టెన్ అయితే బాగుంటుందని బీసీసీఐ ఆలోచిస్తోన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీని తప్పించి- ఆ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు జట్టు పగ్గాలను అప్పగించే దిశగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఆ సీనియర్ బ్యాటర్.. రోహిత్ శర్మే అవుతాడు.