భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే..ఆలోచన ఎలా ఉంది. అవును..క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయ్.
ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంటలు పెళ్లిపీటలెక్కగా… మరికొన్ని జంటలు మనస్ఫర్ధలతో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. అయితే, కొందరి సెలబ్రిటీల్లో వచ్చిన ప్రేమ, పెళ్లి గాసిప్స్ సైతం పుకార్లులానే మిగిలిపోయాయి.
ఇక, టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్ పంత్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన డైనమిక్ గేమ్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు ఈ డైనమైట్. లేటెస్ట్ గా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు.
ఊర్వశి రౌతేలాను కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురు చూసినట్లు బీ టౌన్ కోడై కూస్తోంది. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్ చేస్తుందట. అత్యంట టైట్ షెడ్యూల్లో ఊర్వశి ఉంది. అప్పుడు ఊర్వశి షూటింగ్లో ఉండటం తెలుసుకున్న రిషబ్, ఊర్వశిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అలా వెళ్లిన రిషబ్ ఆమెకోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్ వర్గాల నుంచి సమాచారం. కాగా వీరిద్దరికి కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఊర్వశి, రిషబ్ నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా బహిర్గతం అయ్యేది కదా అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయట.
అయితే, 2019లో ముంబైలోని జుహులోని ఒక హోటల్‌కు రిషబ్, ఉర్వశీ డిన్నర్ కోసం వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అంతేకాదు.. రిషబ్ తన వాట్సప్‌లో ఉర్వశిని బ్లాక్ చేశాడని.. అప్పటి నుంచి వారిద్ధరు ఎక్కువగా కలవడం లేదని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న బాబితాలో అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్, మొహసీన్ – రీనా, సంగీత – అజారుద్దీన్, జహీర్ ఖాన్ – సాగరిక, యువరాజ్ – హెజెల్ కీచ్, హర్భజన్ – గీతా బస్రా ఇలా చాలా మందే ఉన్నారు. ఇలా రిషబ్ పంత్ , ఉర్వశీలు కూడా ప్రేమలో ఉంటే.. వారి బంధాన్ని ఎక్కడి వరకూ తీసుకెళ్తారో వేచి చూడాలి.