ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు మరో నెల రోజుల సమయం ఉన్నది. ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెటర్లు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లి ప్రాక్టీస్ చేసుకునే వీలు లేదు. మే 19న టీమ్ ఇండియా క్రికెటర్లు అందరూ ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్కు చేరుకోనున్నారు. ఆ తర్వాతే సాధన ప్రారంభం కానున్నది. మరి ఇంగ్లాండ్ వెళ్లే టీమ్ ఇండియా క్రికెటర్ల ఫిట్నెస్ ప్రస్తుతం ఎలా ఉన్నదో చూద్దాం. (PC: BCCI)
ఐపీఎల్ సమయంలో అపెండీసైటిస్ బారిన పడిన కేఎల్ రాహుల్ శస్త్ర చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాను కోలుకుంటున్నట్లు రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోతెలిపాడు. మే 19లోపు పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నది. అయితే మ్యాచ్కు ముందు రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవల్సిన అవసరం ఉన్నది. (PC: BCCI)