నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ కచ్చితంగా 9 నిమిషాలు గ్రౌండ్ లో ఉండాలి. టైం సరిపోనందున అంపైర్లు బౌలింగ్ ను ఆపారు. దీంతో ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఫలితంగా మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యమైంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
ధోని.. ఇలా కావాలనే చేశాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నాలుగు నిమిషాలు ఆలస్యం చేయడంతో గుజరాత్ బ్యాటర్లు రషీద్ ఖాన్, విజయ్ శంకర్ పై ఒత్తిడి పడిందని.. ఆ తర్వాత శంకర్ ఔటయ్యాడని.. ధోనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు గెలిపించుకోవడంలో భాగంగా ఇవన్నీ మామూలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. (PC : Twitter)
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ధోని ఇలాంటి సాహసోపేతమైన, వ్యూహాత్మకమైన చర్యలకు పాల్పడి సీఎస్కేను రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాడు. 2019లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ధోని డగౌట్ నుంచి మిడిల్ గ్రౌండ్‌కి వచ్చి మరి అంపైర్లతో గొడవ పడ్డాడు. నో బాల్ విషయంలో అంపైర్ నిర్ణయంపై డగౌట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ధోనీ ఏకంగా ఫీల్డ్‌లోకి వచ్చేశాడు. అసలు అంపైర్లతో గొడవ పడటానికి బయట కూర్చున్న వ్యక్తి గ్రౌండ్లోకి రావడం హిస్టరీలో అదే తొలిసారి.
ఐపీఎల్ నిబంధన 24.2.3 ప్రకారం.. ఓ ఆటగాడు.. ఎనిమిది నిమిషాల కన్నా మ్యాచుకు దూరమైతే.. ఆ బ్యాటర్ లేదా బౌలర్ ఎంత సమయం ఐతే.. దూరమయ్యారో.. అంతే సేపు వారి చేత బౌలింగ్ కానీ.. బ్యాటింగ్ గానీ చేయించకూడదు. కానీ, ధోని ఈ రూల్ ను అతిక్రమించాడు. అంపైర్లు కూడా ధోని మాటకు కట్టుబడి పతిరన చేత బౌలింగ్ వేయించడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.