MS Dhoni: ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పాక ధోనీ ఏం చేయబోతున్నాడు? బాలీవుడ్ ఎంట్రీ నిజమేనా?
MS Dhoni: ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పాక ధోనీ ఏం చేయబోతున్నాడు? బాలీవుడ్ ఎంట్రీ నిజమేనా?
MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎంఎస్ ధోనీ ఇటీవలే ఐపీఎల్ నుంచి కూడా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. మరి ధోనీ రిటైర్ అయ్యాక ఏం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. త్వరలోనే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే 2022 సీజన్ అతడికి చివరి ఐపీఎల్ కానున్నది. మరి ఆ తర్వాత ధోనీ ఏం చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
2/ 6
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అకస్మాత్తుగా 2020 అగస్టు 15న రాజీనామా చేశారు. ప్రస్తుతం ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఫైనల్ చేర్చిన ధోనీ... 2022 ఐపిఎల్ సీజన్లో చివరిసారిగా ఆడబోతున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది చేపాక్‌లో వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చాడు.
3/ 6
ఎంఎస్ ధోనీని ఇకపై క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చూడలేమని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అదే సమయంలో అతను క్రికెట్ అనంతరం ఏం చేస్తాడనే ఆసక్తి కూడా నెలకొన్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతను బాలీవుడ్లో అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
4/ 6
ధోనీ నిజంగా సినిమా రంగలోకి వెళ్తాడా అని అనుమానలు కూడా ఉన్నాయి. అయితే గతంలో సీఎస్కే జట్టులో ఉన్న హర్బజన్ సింగ్ ఒక సినిమాలో నటించాడు. గతంలో బ్రెట్ లీ, అజయ్ జడేజా, వినోద్ కాంబ్లీ వంటి క్రికెట్లర్లు సినిమాల్లో నటించిన విషయాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
5/ 6
బాలీవుడ్ ఎంట్రీపై ధోనీని ప్రశ్నించగా స్పందించాడు. బాలీవుడ్ చాలా ప్రత్యకమైనది. అక్కడ నటించడం అంటే చాలా కష్టం. బాలీవుడ్లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. నేను కూడా నటిస్తాను. కానీ అది కేవలం వాణిజ్య ప్రకటనలకు మాత్రమే పరిమితం. నన్ను అందులోకి లాగకండి అని సమాధానం ఇచ్చాడు.
6/ 6
ధోనీ జీవితం ఆధారంగా గతంలో ఎంఎస్ ధోనీ - అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమా వచ్చింది. అందులో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించాడు. ధోనీ కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా.. అది నటుడిగా కానది మాత్రం తేల్చి చెప్పాడు.