IPL Mini Auction 2023 : మినీ వేలం తర్వాత ఈ జట్టును చూస్తే ప్రత్యర్థులు గజగజ వణకాల్సిందే
IPL Mini Auction 2023 : మినీ వేలం తర్వాత ఈ జట్టును చూస్తే ప్రత్యర్థులు గజగజ వణకాల్సిందే
IPL Mini Auction 2023 : వీరితో పాటు ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి నికోలస్ పూరన్ లపై కూడా కాసుల వర్షం కురిసింది. ఐర్లాండ్ ప్లేయర్ జాష్ లిటిల్, హెన్రిచ్ క్లాసెన్, రైలీ రోసోలు కూడా మంచి ధరనే పలికారు.
కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ (IPL Mini Auction 2023) మినీ వేలం ప్లేయర్లపై కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ ప్లేయర్లు స్యామ్ కరణ్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ లు జాక్ పాట్ ను కొట్టేశారు.
2/ 8
వీరితో పాటు ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి నికోలస్ పూరన్ లపై కూడా కాసుల వర్షం కురిసింది. ఐర్లాండ్ ప్లేయర్ జాష్ లిటిల్, హెన్రిచ్ క్లాసెన్, రైలీ రోసోలు కూడా మంచి ధరనే పలికారు.
3/ 8
వేలంలో ముంబై ఇండియన్స్ 8 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
4/ 8
మినీ వేలానికి ముందు చాలా మంది ప్లేయర్లను విడుదల చేసిన ముంబై ఇండియన్స్ వేలంలో తెలివిగా ప్రవర్తించింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.5 కోట్లకు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
5/ 8
ఈ సీజన్ లో బలహీనంగా ఉన్న స్పిన్ ను బలోపేతం చేసేందుకు పీయూశ్ చావ్లాను సొంతం చేసుకుంది. ఇక మినీ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ ను చూస్తే చాలా భీకరంగా కనిపిస్తుంది. జట్టు మొత్తం పవర్ హిట్టర్లతో నిండిపోయింది.
6/ 8
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డివాల్డ్ బ్రేవిస్, టిమ్ డేవిడ్, స్టబ్స్ లు పవర్ హిట్టర్లుగా ఉన్నారు. తాజాగా వీరికి కామెరూన్ గ్రీన్ కూడా జతయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా.. దూకుడుగా ఆడగలడు.
7/ 8
జోఫ్రా ఆర్చర్, జస్ ప్రీత్ బుమ్రాలతో పేస్ విభాగం బలంగా కనిపిస్తుంది. జై రిచర్డ్ సన్, స్యామ్స్ రూపంలో పేసర్లు ఉన్నారు. అవసరం అయితే గ్రీన్, టిమ్ డేవిడ్ లు బౌలింగ్ చేయగల సమర్థులు. పీయూశ్ చావ్లా రూపంలో సీనియర్ స్పిన్నర్ జట్టులోకి వచ్చాడు.
8/ 8
మినీ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తుంది. పవర్ హిట్టర్లు ఉండటంతో ఎంతటి భారీ స్కోరును అయినే చేజ్ చేయగలిగేలా కనిపిస్తుంది. వచ్చే ఐపీఎల్ లో ప్రత్యర్థి జట్లకు ఇది ప్రతికూల అంశమే. ముంబై బ్యాటింగ్ లైనప్ కు బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు వణకాల్సిందే.