రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం తొలి బిడ్ ను రాజస్తాన్ రాయల్స్ పాడింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా రంగంలోకి దిగింది. రూ. 5 కోట్లకు చేరుకున్న తర్వాత ఆర్సీబీ తప్పుకుంది. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్.. దూకుడు కనబర్చింది. చూస్తుండగానే వేలం రూ. 10 కోట్లు దాటేసింది.