ఐపీఎల్ 2023 వేలాని (IPL Auction 2023)కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక, ఫైనల్ లిస్ట్ ను బీసీసీఐ (BCCI) మంగళవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 405 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. ఇందులో 273 మంది భారతీయులు, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలం జాబితాలో మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు.
అత్యంత ఖరీదైన ఆటగాళ్ల బేస్ ప్రైస్ గురించి మాట్లాడితే రూ.2 కోట్లు కాగా అందులో 19 మంది ఆటగాళ్లను చేర్చారు. వీరంతా విదేశీయులే. అదే సమయంలో, 11 మంది ఆటగాళ్లను రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్‌లో చేర్చగా, 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయల బేస్ ప్రైస్ లో చేర్చబడ్డారు. భారత క్రీడాకారుడు మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలు కోటి రూపాయల బేస్ ప్రైస్‌లో ఉన్నారు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు మయాంక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పేలవ ప్రదర్శన తర్వాత అతడిని జట్టు విడుదల చేసింది. (ఐపీఎల్/ట్విట్టర్)
సామ్ కర్రన్ : వేలంలో ఆల్రౌండర్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈసారి ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ T20 ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేసి ఇంగ్లీష్ జట్టును ఛాంపియన్‌గా మార్చడంలో కీ రోల్ ప్లే చేశాడు. అతను 4 సార్లు ఛాంపియన్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లో కూడా సభ్యుడు. అతని బేస్ ధర రూ.2 కోట్లు. 145 టీ20 మ్యాచుల్లో 9 హాఫ్ సెంచరీల సాయంతో 1731 పరుగులు చేశాడు. 9 అర్ధ సెంచరీలు సాధించాడు. స్ట్రైక్ రేట్ 136. అదే సమయంలో.. ఈ 24 ఏళ్ల యువ ఆటగాడు 149 వికెట్లు కూడా తీసుకున్నాడు. 4 సార్లు 4 వికెట్లు, 2 సార్లు 5 వికెట్లు తీశాడు. 10 పరుగులకే 5 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. (AP)
బెన్ స్టోక్స్ : టీ20 ఫార్మాట్ లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. వన్డేల నుంచి రిటైర్ అయిన స్టోక్స్ ప్రస్తుతం టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని బేస్ ధర కూడా రూ.2 కోట్లు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 లీగ్‌లో అతడిపై ఇప్పటికే భారీ బిడ్లు దాఖలయ్యాయి. అతని టీ20 రికార్డును పరిశీలిస్తే,.. 31 ఏళ్ల స్టోక్స్ 157 మ్యాచ్‌ల్లో 3008 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు. స్ట్రైక్ రేట్ 133. ఈ ఫాస్ట్ బౌలర్ 33 వికెట్లు కూడా తీశాడు. 16 పరుగులకే 4 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. (AP)
కామెరాన్ గ్రీన్ : మొత్తం 10 జట్లు ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై దృష్టి సారిస్తున్నాయి. అతని బేస్ ధర కూడా రూ.2 కోట్లు. ఇటీవల భారత పర్యటనలో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఇప్పటి వరకు 21 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 245 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 138. 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా 5 వికెట్లు కూడా తీశాడు. (AP)
రిలే రస్సో : దక్షిణాఫ్రికా డేంజరస్ ఓపెనర్ రిలే రస్సోపై కూడా వేలంలో భారీగా అంచనాలు ఉన్నాయి. అతని బేస్ ధర కూడా రూ.2 కోట్లు. పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి ఇంగ్లండ్‌లో జరిగిన ది హండ్రెడ్ వరకు అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇటీవల భారత పర్యటనలోనూ దూకుడుగా సెంచరీ సాధించాడు. దీని తర్వాత టీ20 వరల్డ్‌కప్‌కు కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 33 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు 270 టీ20 మ్యాచ్‌లు ఆడి 6874 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు సాధించాడు. స్ట్రైక్ రేట్ 143. (AP)
కేన్ విలియమ్సన్ : న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతన్ని టీమ్ విడుదల చేసింది. కానీ టీ20లో అతని రికార్డును పరిగణనలోకి తీసుకుంటే.. కేన్ మామ కోసం జట్లు భారీ మొత్తాన్ని వెచ్చించవచ్చు. అతని బేస్ ధర కూడా రూ.2 కోట్లు. 32 ఏళ్ల విలియమ్సన్ టీ20 రికార్డును పరిశీలిస్తే.. అతను 245 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 6304 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 123. అతను ఒక సెంచరీ మరియు 22 అర్ధ సెంచరీలు చేశాడు. (Kane Williamson Instagram)